- మార్వాడీల వ్యాపారాలపై చర్యలు తీసుకోవాలంటూ తహాసిల్దార్‌కి వినతిపత్రం
ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ: ఓయూ జేఏసీ పిలుపు మేరకు “మార్వాడి హటావో -తెలంగాణ బచావ్” కార్యక్రమంలో భాగంగా ఎల్లారెడ్డిపేట మండల వ్యాపారవేత్తలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా తహాసిల్దార్ కార్యాలయం వద్ద ఫ్లెక్సీలు ప్రదర్శించి కార్యాలయాన్ని ముట్టడించారు. అనంతరం తహాసిల్దార్‌కు వినతిపత్రాన్ని సమర్పించారు.వ్యాపారవేత్తలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మార్వాడీలు వివిధ రంగాల్లో వ్యాపారాలు చేపట్టి స్థానిక వ్యాపారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బంగారం, వెండి, రాగి, ఇత్తడి, ఇనుము, ఫర్నిచర్, ఎలక్ట్రానికల్ వస్తువులు తదితర రంగాల్లో నాణ్యత లేని డూప్లికేట్ వస్తువులు సరఫరా చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకొని మార్వాడీల వ్యాపారాలపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, తెలంగాణ వ్యాపారులను కాపాడాలని వారు డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో మండలంలోని పలువురు వ్యాపారవేత్తలు పాల్గొన్నారు.