Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 July 2025, 11:28 pm Posted by : ramakrishna

వ్యాపారస్థులకు ట్రెడ్ లైసెన్స్ తప్పనిసరి

  • మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్

 

భీమ్ గల్, బతుకమ్మ : భీమ్ గల్ మున్సిపల్ పరిధిలో వ్యాపారాలు నిర్భహించే దుకాణదారులందరూ తప్పనిసరిగా మున్సిపల్ ట్రేడ్ లైసెన్స్ కలిగి ఉండాలని కమిషనర్ గోపు గంగాధర్ సూచించారు. శుక్రవారం ఆయన పట్టణంలోని పలు దుకాణాల్లోలైసెన్స్ ల తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు మున్సిపల్ ట్రేడ్ లైసెన్స్ వారి రూమ్ కొలతల ప్రకారం ఆన్లైన్లో లో జారీ చేయడం జరుగుతుందన్నారు. నూతనంగా  పట్టణంలో వివిధ వార్డులో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లను కమిషనర్ పరిశీలించారు. బేస్మెంట్ పూర్తయిన ప్రతి ఒక్కరికి వారి అకౌంట్లో లక్ష రూపాయలు జమవుతున్నాయని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ప్రతి ఒక్కరు తొందరగా బేస్మెంట్ వరకు పూర్తి చేయాలన్నారు. వారి వెంట మేనేజర్ నరేందర్ వార్డ్ ఆఫీసర్ తదితరులున్నారు.