బతుకమ్మ, బిచ్కుంద : జుక్కల్ నియోజకవర్గం లోని కౌలాస్ నాలా ప్రాజెక్ట్ అధికారుల పనితీరు ఇష్ట రీతిన వరద గేట్లు వదలడం వల్ల బిచ్కుంద మండలంలోని చిన్నదేవాడ వాగు వద్ద నది అవతల నుండి వడ్లు తీసుకొస్తున్న ట్రాక్టర్ చిన్న దేవాడ వాగులో చిక్కుకుపోయింది. ఎలాంటి ప్రమాద హెచ్చరికలు ఇవ్వకుండా ఈ విధంగా గేట్లు వదలడం ఎంతవరకు సమంజసం స్థానికులు వాపోయారు. కౌలాస్ నాలా ప్రాజెక్టు అధికారులు మొద్దు నిద్ర వదిలి ప్రజల గురించి ఆలోచించి పని చేయాలని ఆ రైతుకు జరిగిన నష్టానికి కౌలాస్ నాలా ప్రాజెక్ట్ అధికారులు బాధ్యత వహించాలి అని గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.