ట్రాక్టర్ బోల్తా : అక్కడికక్కడే ఒకరి మృతి

గాంధారి, బతుకమ్మ : ట్రాక్టర్ బోల్తా పడి ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన గాంధారిమండలంలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..  గాంధారి మండలం పేట్ సంఘం నుంచి చద్మాల్ తండాలో గల గుడికి కందూరు చేసుకోవడానికి ఓ కుటుంబ సభ్యులు ట్రాక్టర్‌పై వెళ్తున్నారు. ఈక్రమంలో నేరేల్ తండా వద్ద ట్రాక్టర్ బోల్తాపడింది.  ఈ ప్రమాదంలో గణేష్ (తండ్రి రావ్ సింగ్) అక్కడికక్కడే మృతి చెందారు.  మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని తక్షణమే ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన...