Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 December 2025, 11:29 am Posted by : ramakrishna

ట్రాక్టర్ బోల్తా : అక్కడికక్కడే ఒకరి మృతి

గాంధారి, బతుకమ్మ : ట్రాక్టర్ బోల్తా పడి ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన గాంధారిమండలంలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..  గాంధారి మండలం పేట్ సంఘం నుంచి చద్మాల్ తండాలో గల గుడికి కందూరు చేసుకోవడానికి ఓ కుటుంబ సభ్యులు ట్రాక్టర్‌పై వెళ్తున్నారు. ఈక్రమంలో నేరేల్ తండా వద్ద ట్రాక్టర్ బోల్తాపడింది.  ఈ ప్రమాదంలో గణేష్ (తండ్రి రావ్ సింగ్) అక్కడికక్కడే మృతి చెందారు.  మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి.
గాయపడిన వారిని తక్షణమే ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


One person died on the spot after a tractor overturned