Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 May 2026, 12:51 pm Posted by : ramakrishna

ట్రాక్టర్ బోల్తా డ్రైవర్ మృతి

 

 మాక్లూర్, బతుకమ్మ:

ఉపాధి హామీ పథకంలో మట్టిని  తరలించడానికి  చెరువులోకి వచ్చిన ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్  మృతి చెందాడు.  ఈ సంఘటన మాక్లూర్ మండలం లో కొత్తపల్లి గ్రామంలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం శ్రీధర్ (25) ఉపాధి హామీ కూలీలు చెరువులో తవ్విన  నల్ల మట్టి   ట్రాక్టర్ లో  సొంత వ్యవసాయ భూమికి తరలించడానికి సిద్ధమయ్యాడు. గ్రామానికి చెందిన  పుల్ల నవీన్ ట్రాక్టర్ తీసుకుని వెళ్లే క్రమంలో  ట్రాక్టర్ ఒక్కసారి చెరువు కట్టపై నుండి  బోల్తాపడటంతో డ్రైవర్ శ్రీధర్ కు తల పగిలి నుజ్జునుజ్జు అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.  బాధితుడి తండ్రి పోశెట్టి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మాక్లూర్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిసింది.

Tractor overturns, driver dies