Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 November 2026, 11:39 pm Posted by : ramakrishna

బైక్ ను ఢీ కొట్టిన ట్రాక్టర్

 

. . . ఇద్దరు వ్యక్తుల దుర్మరణం

 

మోపాల్, బతుకమ్మ : 

 

గడ్డి లోడ్ తో వెళుతున్న ట్రాక్టర్ ఎదురుగా వచ్చిన బైక్ డికొన్నాయి. ఈ ప్రమాదం లో బైక్ పైన ఉన్న ఇద్దరు వ్యక్తులు స్పాట్ డెడ్ అయ్యారు. ఈ సంఘటన మంగళవారం సాయంత్రం మోపాల్ మండలం కంజర్ శివారు లోని బ్రిడ్జి వద్ద జరిగింది.నిజామాబాద్ నగరం లోని కోటగల్లి కి చెందిన ఆడెపు మనోజ్  (46),  కాముడు కాంత  ప్రాంతానికి చెందిన గోల రాజు (36) అనే ఇద్దరు కులాస్ పూర్ లో విందుకు హాజరు అయ్యారు. తిరుగు ప్రయాణం లో ద్విచక్ర వాహనంపై కంజర వైపు బయలుదేరారు. వారి బైక్ ను  ట్రాక్టర్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే  దుర్మరణం పాలయ్యా రు. మనోజ్ మెడికల్ రిప్ గా పని చేస్తుండగా, అతనికి భార్యచ ముగ్గురు పిల్లలు ఉన్నటు తెలిసింది. రాజు డ్రైవర్ గా చేసుండగా అతనికి భార్య, ఒక నెల వయసు కలిగిన కొడుకు ఉన్నట్టు తెలిసింది. ఈ మేరకు మోపాల్ పోలీస్ లు కేసు నమోదు చేసి మృతదేహలను పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు వ్యక్తులు రోడ్డు ప్రమాదం లో చనిపోవడం తో కోటగల్లి లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Tractor hits a bike