ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత

 ధర్పల్లి, బతుకమ్మ: ధర్పల్లి మండలం రామడుగు గ్రామంలో  సోమవారం రాత్రి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ నెంబర్ టీఎస్16 యూసీ 2733 ను పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేశామని ధర్పల్లి ఎస్సై రామకృష్ణ తెలిపారు. రెవెన్యూ అధికారుల అనుమతితో  ఇసుక తరలించాలని,అలాకాకుండా  ఎవరైనా అక్రమంగా ఇసుక తరలిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని  ఎస్సై హెచ్చరించారు.