నూతన డీఈవో మల్లికార్జున్‌కు టిపిటిఎఫ్ నాయకుల ఘన సన్మానం

  కామారెడ్డి, బతుకమ్మ :   కామారెడ్డి జిల్లాకు నూతనంగా జిల్లా విద్యాశాఖ అధికారిగా (డీఈవో) బాధ్యతలు స్వీకరించిన మల్లికార్జున్‌ను తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టిపిటిఎఫ్) జిల్లా నాయకులు గురువారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయనను ఘనంగా సన్మానించారు. జిల్లా, మండల స్థాయి బాధ్యులు డీఈవోను కలిసి విద్యాశాఖలో నెలకొన్న వివిధ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా జిల్లాలో కొనసాగుతున్న అక్రమ డిప్యూటేషన్లపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే ఉపాధ్యాయ సంఘాలన్నింటితో కలిసి సమన్వయ సమావేశం...