టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం 

హైదరాబాద్, బతుకమ్మ :  టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం కొద్దిసేపట్లో హైదరాబాద్ లోని గాంధీభవన్ లో జరగనుంది.  ఈసమావేశానికి ముఖ్య అతిథిగా ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ హాజరుకానున్నారు.  స్థానిక ఎన్నికలతో పాటు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభపై, తాజా రాజకీయ పరిణామాలతో పాటు నామినేట్ పోస్టుల భర్తీపై చర్చించే అవకాశం ఉంది.  ఎజెండాలో ప్రధాన అంశంగా  జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఉన్నట్లు తెలుస్తోంది.