Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 October 2024, 4:07 pm Posted by : ramakrishna

టీపీసీసీ అధ్యక్షుని సన్మాన సభకు తరలిరావాలి

బతుకమ్మ , బాన్సువాడ : ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఈనెల 4న కలెక్టర్ గ్రౌండ్ లో జరిగే టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు అధిక సంఖ్యలో తరలిరావాలని ఎమ్మెల్యే ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ అధ్యక్షతన గురువారం మోస్రా మండల కేంద్రంలోని ముఖ్య నాయకులతో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని గ్రామ గ్రామాన నుండి ఈనెల 4న నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ గ్రౌండ్ లో జరిగే బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా మైనారిటీ అధ్యక్షులు ఖలేక్, పార్టీ మండలాల అధ్యక్షులు లక్ష్మణ్, కృష్ణారెడ్డి, హరి, పిట్ల రాములు , ప్రవీణ్ గౌడ్, హన్మంత్ రెడ్డి , గంగాధర్ , అశోక్ , సాయాగౌడ్ , కిషన్ రెడ్డి ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.