ఘనంగా టీపీసీసీ అధ్యక్షుడి జన్మదిన వేడుకలు
జుక్కల్, బతుకమ్మ : ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ ఆదేశాల మేరకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలను ఆదివారం నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రజా పండరి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో నాయకులు కేక్ కట్ చేసి మహేష్ కుమార్ గౌడ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ బలోపేతానికి ఆయన చేస్తున్న సేవలను కొనియాడుతూ...