Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 May 2026, 8:47 pm Posted by : ramakrishna

ఘనంగా టీపీసీసీ అధ్యక్షుడి జన్మదిన వేడుకలు

 

జుక్కల్, బతుకమ్మ :

 

ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ ఆదేశాల మేరకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలను ఆదివారం నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రజా పండరి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో నాయకులు కేక్ కట్ చేసి మహేష్ కుమార్ గౌడ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ బలోపేతానికి ఆయన చేస్తున్న సేవలను కొనియాడుతూ నాయకులు అభినందనలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం కావాలని, మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో పార్టీ ప్రజలకు మరింత చేరువ అవుతుందని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండలంలోని గ్రామ సర్పంచ్ లు, ఉపసర్పంచ్ లు, వార్డు సభ్యులు, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు, యువజన కాంగ్రెస్ నాయకులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.