కొండగట్టు అంజన్న ని దర్శించుకున్న టీపీసీసీ అధ్యక్షుడు
జగిత్యాల, బతుకమ్మ : తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ శుక్రవారం కుటుంబ సమేతంగా సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేదమంత్రోచ్చారణల మధ్య ఆయనకు ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఉండాలని, తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధించాలని, రైతులు, యువత, మహిళలు సంతోషంగా జీవించాలని స్వామివారిని ప్రార్థించినట్లు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు....