Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 June 2026, 7:55 pm Posted by : ramakrishna

గడుగు గంగాధర్ నివాసాన్ని సందర్శించిన టీపీసీసీ అధ్యక్షులు

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ఇటీవల విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదంలో పూర్తిగా దగ్ధమైన రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ నివాసాన్ని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సందర్శించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. జరిగిన నష్టంపై విచారం వ్యక్తం చేస్తూ, ప్రభుత్వం తరఫున అందుబాటులో ఉన్న సహాయాన్ని అందించేందుకు కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. ఇలాంటి క్లిష్ట సమయంలో కాంగ్రెస్ పార్టీ బాధిత కుటుంబానికి అండగా ఉంటుందని, ధైర్యంగా ఉండాలని మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. కుటుంబ సభ్యులకు అవసరమైన సహాయ సహకారాల కోసం సంబంధిత అధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకునేలా చూస్తామని హామీ ఇచ్చారు.

 

TPCC President visits Gadugu Gangadhar's residence.