ఉజ్జయిని మహంకాళి ఆలయంలో టీపీసీసీ అధ్యక్షుడు ప్రత్యేక పూజలు
హైదరాబాద్, బతుకమ్మ : టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కుటుంబ సమేతంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేదమంత్రోచ్ఛారణల నడుమ మహేష్ కుమార్ గౌడ్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు ప్రత్యేక ఆశీర్వచనాలు అందజేసి, అమ్మవారి తీర్థప్రసాదాలను అందించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్, పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. దర్శనం అనంతరం మహంకాళి అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర...