Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 August 2026, 4:41 pm Posted by : ramakrishna

ఉజ్జయిని మహంకాళి ఆలయంలో టీపీసీసీ అధ్యక్షుడు ప్రత్యేక పూజలు

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కుటుంబ సమేతంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేదమంత్రోచ్ఛారణల నడుమ మహేష్ కుమార్ గౌడ్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు ప్రత్యేక ఆశీర్వచనాలు అందజేసి, అమ్మవారి తీర్థప్రసాదాలను అందించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్, పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. దర్శనం అనంతరం మహంకాళి అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరికీ ఉండాలని మహేష్ కుమార్ గౌడ్ ఆకాంక్షించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

 

TPCC President offers special prayers at Ujjaini Mahankali Temple.