హైదరాబాద్, బతుకమ్మ :
టీఎన్జీవో ఆధ్వర్యంలో ఆగస్టు 5వ తేదీన నిర్వహించనున్న టీఎన్జీవో బోనాల మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని టీఎన్జీవో ప్రతినిధులు టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ని ఆహ్వానించారు. ఈ మేరకు న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్, హైదరాబాద్‌లో మహేష్ కుమార్ గౌడ్‌ను టీఎన్జీవో ప్రతినిధులు శనివారం మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. అనంతరం జిల్లా ఉద్యోగుల సమస్యలపై ఆయనతో చర్చించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మహేష్ కుమార్ గౌడ్ సానుకూలంగా స్పందించారు. ప్రతి సంవత్సరం భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న టీఎన్జీవో బోనాల కార్యక్రమాలను నిర్వహిస్తున్న టీఎన్జీవో అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులను ఆయన అభినందించారు. బోనాల ఉత్సవాలకు హాజరవుతానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా చైర్మన్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్, టీఎన్జీవో జిల్లా కార్యదర్శి నేతి కుంట శేఖర్‌లు టీఎన్జీవోస్ తరఫున మహేష్ కుమార్ గౌడ్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో రాష్ట్ర కార్యదర్శి పోల శ్రీనివాస్, జిల్లా కోశాధికారి నిరంజన్ గౌడ్, ఆర్మూర్ యూనిట్ అధ్యక్షులు శశికాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.