Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 April 2025, 12:31 pm Posted by : ramakrishna

ఈడీ కార్యాలయం వద్ద టీపీసీసీ ఆధ్వర్యంలో భారీ ధర్నా

హైదరాబాద్, బతుకమ్మ :  హైదరాబాద్ లోని ఈడీ కార్యాలయం వద్ద టీపీసీసీ ఆధ్వర్యంలో గురువారం భారీ ధర్నా నిర్వహించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో  కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీ పేర్లను ఈడీ ఛార్జి షీట్ లో చేర్చడాన్ని నిరసిస్తూ.. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏఐసీసీ ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్ హాజరయ్యారు. ఈధర్నాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్ , మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖ, ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్, ఎమ్మెల్యేలు శంకరయ్య, రాజ్ ఠాగూర్, తదితరులు పాల్గొన్నారు.