నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : పట్టణంలో గ్రంథాలయ నూతన భవనం,జిల్లా న్యాయస్థానానికి సంబంధించిన భవనాల కోసం ఓల్డ్ ( పాత) డిఈఓ కార్యాలయం సమీపంలోని ఖాళీ స్థలాన్ని గ్రంథాలయ చైర్మెన్ అంతిరెడ్డి రాజిరెడ్డితో కలిసి టిపిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ శనివారం పరిశీలించారు. అనంతరం స్థానిక నాయకులతో కలిసి గ్రంథాలయాన్ని సందర్శించి యువతీ యువకులతో ముచ్చటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 65 వేలకు పైగా ఉద్యోగాలు కల్పించినట్లు నిరుద్యోగులకు వివరించారు. తాజాగా ఆర్టీసీలో ఉద్యోగాల కోసం వెలువడిన నోటిఫికేషన్ సద్వినియోగం చేసుకోవాలని నిరుద్యోగులకు సూచించారు. ఈ కార్యక్రమంలో టీపిసిసి జనరల్ సెక్రటరీ రాం భూపాల్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు విపుల్ గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు శేఖర్ గౌడ్, రత్నాకర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మెన్ నగేష్ రెడ్డి పాల్గొన్నారు.
