నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని దుబ్బాక సార్వజనిక్ వినాయక శోభాయాత్ర లో టిపిసిసి అధ్యక్షులు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శోభాయాత్ర రథాన్నిజెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆగయ్య చౌరస్తాలోని మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహ శోభ యాత్ర లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ, కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి, పోలీసు కమిషనర్ సాయి చైతన్య, రైతు కమిషన్ మెంబర్ గడుగు గంగాధర్, ఉర్దూ అకాడమి చైర్మెన్ తాహార్బిన్ ఆమ్హ్దన్, డీసీసీ మానాల మోహన్ రెడ్డి, నుడా చైర్మెన్ కేశ్ వేణు, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
