Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 September 2026, 2:44 pm Posted by : ramakrishna

23 వ రోజుకు చేరిన టీపీ జేఏసీ నిరసనలు

 

. . . భోజన విరామం లో ఆందోళన

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

పాలిటెక్నిక్ కళాశాలలను శక్తి / వై ఐ ఎస్ యూ లో విలీనం చేయవద్దని టీపీజేఏసీ నిజామాబాద్ జిల్లా శాఖ నిరసనలు 23వ రోజుకు చేరాయి. మంగళవారం నగరం లోని కంటేశ్వర్ లోని గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీ లో లంచ్ అవర్ ధర్నా కొనసాగించింది. ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో విధులు నిర్వహిస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్బంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ పాలిటెక్నిక్ వ్యవస్థ గత 70 ఏళ్లుగా అత్యంత నిరుపేద, పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు తక్కువ ఖర్చుతో సాంకేతిక విద్యను అందిస్తూ, 95% ప్రవేశాలతో విజయవంతంగా నడుస్తున్నవని అన్నారు. పాలిటెక్నిక్ పేదల విద్యా వ్యవస్థ కావున దీనిని మార్చరాదు, వేరే దానిలో విలీనం చేయవద్దని అన్నారు.పాలిటెక్నిక్ లను శక్తి లో విలీనం చేయవద్దని కమిటీ త్వరగా సమావేశమై సానుకూల నివేదిక ఇచ్చి విద్యార్థుల భవిష్యత్తు కాపాడాలి అని డిమాండ్ చేసారు.