బైక్ చోరీల ముఠాను పట్టుకున్న టౌన్ – 1 పోలీసులు

  నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :   బైక్‌లను దొంగిలిస్తూ పలుచోట్ల చోరీలకు పాల్పడుతున్న నేరస్తుడిని నిజామాబాద్ టౌన్ - 1 పోలీసులు అరెస్ట్ చేసి, అతని వద్ద నుండి ఆరు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్టు ఇన్స్ పెక్టర్ బి.రఘుపతి తెలిపారు. ఈ మేరకు టౌన్-1 పోలీస్ స్టేషన్‌లో క్రైం నంబర్ 36/2026 కింద కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. పోలీసుల వివరాల ప్రకారం, ప్రధాన నిందితుడు వధేరా నవీన్ (22), కామారెడ్డి జిల్లా పెద్ద కొడఫ్గల్ మండలం శివపురం గ్రామానికి...