జలదృశ్యాలు తిలికించడానికి పర్యాటకుల రాక
మెండోరా, బతుకమ్మ:
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కు ఎగువ ప్రాంతాల నుంచి 88,769 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుంది దీంతో ప్రాజెక్టు గేట్లు ఎత్తి 61,049 క్యూసెక్కుల నీటిని నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. దీంతో జల దృశ్యాలను చూడడానికి, ప్రాజెక్ట్ అందాలను తిలకించడానికి అదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్, కరీంనగర్ తదితర ప్రాంతాల నుంచి పర్యాటకులు రావడంతో ప్రాజెక్టుకు పర్యాటక శోభ సంతరించుకుంది. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు వచ్చే పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు

36. 15 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి….
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ప్రధాన కాలువ అయినటువంటి కాకతీయ కాలువ ద్వారా 6800 క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా 1200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో స్థానికంగా ఉన్న జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో నాలుగు టర్బైన్ల ద్వారా 36. 15 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని జెన్ కో డీఈఈ శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 19.9787 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగిందని పేర్కొన్నారు.