ఎస్సారెస్పీకి పర్యాటక శోభ
మెండోరా, బతుకమ్మ: ఆదివారం ఆటవిడుపుగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు అందాలను తిలకించడానికి అధిక సంఖ్యలో పర్యాటకులు రావడంతో ఎస్సారెస్పీ పర్యాటక శోభ సంతరించుకుంది. జల దృశ్యాలను, ప్రాజెక్ట్ అందాలను, జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం, కాకతీయ, సరస్వతి లక్ష్మీ కాల్వల అందాలను చూస్తూ పర్యాటకులు సేద తీరాలి. కొందరు కుటుంబ సమేతంగా వనభోజనాలు సైతం అక్కడిని చేసి సాయంత్రం వరకు కాలక్షేపం చేశారు.