Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 March 2025, 2:55 pm Posted by : ramakrishna

ఎస్సారెస్పీ కేంద్రంగా టూరిజం అభివృద్ధి చేయాలి

హైదరాబాద్, బతుకమ్మ: ఎస్సారెస్పీ నుంచి బాసర వరకు టూరిజం అభివృద్ధి చేసేలా బోటు సౌకర్యం కల్పించాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ లో బ్రహ్మాండమైన ఐలాండ్స్, చూడదగిన ప్రదేశాలు, అనేక జీవ జాతులున్నాయని, ఈ ప్రాంతాన్ని టూరిజం స్పాట్ చేయాలన్నారు.  ఆర్ అండ్ బీ, టూరిజం, ఎండోమెంట్, స్పోర్ట్స్ శాఖ ల పద్దులపై చర్చ సందర్భంగా నియోజకవర్గానికి సంబంధించిన పలు సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చారు.  ఈ ప్రాంతాన్ని టూరిజం స్పాట్ చేయాలని తమ ప్రభుత్వ హయాంలోనే ప్రతిపాదనలు చేశామని, ఇరిగేషన్ ల్యాండ్స్ ను టూరిజం బదిలీ పూర్తయ్యిందని తెలిపారు. ఆ ప్రతిపాదన ప్రభుత్వం వద్ద పెండింగ్ లో ఉందని, ఇన్ చార్జి మంత్రి జూపల్లి కి సైతం విన్నవించామన్నారు.

          ఉపాధి కోసం గల్ఫ్ కు వెళ్లే యువతకు వివిధ పనుల్లో నైపుణ్యం ఉండాలనే లక్ష్యంతో తన నియోజకవర్గంలోని మోర్తాండ్ మండల కేంద్రంలో రూ.5కోట్లతో న్యాక్ సెంటర్ నిర్మించాలని నిర్ణయింమని, టెండర్ పూర్తయన తరువాత మంత్రి ఆ పనులు క్యాన్సిల్ చేశారని, పనులు కొనసాగేల చూడాలని వేముల కోరారు.