Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 May 2026, 5:36 pm Posted by : ramakrishna

నిజామాబాద్ నగరంలో విద్యుత్ అభివృద్ధి పనులను పరిశీలించిన ఉన్నతాధికారులు

 

నిజామాబాద్ సిటి, బతుకమ్మ :

 

జిల్లా కేంద్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులను డైరెక్టర్ ప్రాజెక్ట్స్ మోహన్ రావు, వరంగల్ చీఫ్ ఇంజనీర్  సురేందర్ లు పరిశీలించారు. నగరంలోని రైతు బజార్ వద్ధ నిర్మాణం లో ఉన్నటువంటి ఇండోర్ 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాన్ని పనులను పరిశీలించి సూచనలు చేశారు. 33 కెవి పనులను ప్రారంభించాలన్నారు.

 

Top officials inspect power development works in Nizamabad city

 

సివిల్ పనులు జూన్ మాసాంతానికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆర్య నగర్ ఉపకేంద్రం వద్ద వన్ మెగావాట్ సోలార్ పవర్ ప్లాంట్ స్థలాన్ని పరిశీలించారు. సబ్ స్టేషన్ వద్ద ఉన్నటువంటి పొదలను చెట్లను తొలగించి లైన్లో షిఫ్టింగ్ చేయాలని ఆదేశించారు. త్వరలో సోలార్ పనులు ప్రారంభించాలని వెంకట్ ధీర్ ఇన్ఫ్రా సోలార్ ప్రతినిధి సతీష్ ను ఆదేశించారు. తర్వాత 33/11 కెవి ఆర్య్ నగర్ ఉప కేంద్రంలోని ఆటోమేషన్ పనులను పరిశీలించారు. విద్యుత్ సరఫరా గురించి తెలుసుకున్నారు. వారి వెంట నిజామాబాద్ జిల్లా ఎస్ ఇ పివి.రాజేశ్వరరావు, డిఇ కన్స్ట్రక్షన్ డి.వెంకటరమణ, ఈ ఈ సివిల్ స్వామి, ఏడిఈ కన్స్ట్రక్షన్ తోట రాజశేఖర్, ఏడిఈ ఆపరేషన్ 3 వినోద్, సివిల్ సాయి తేజ, ఏ ఇ లు కాశీనాథ్, బాబా శ్రీనివాస్, ఆర్.సునీత, శ్రావణ్ కుమార్, కార్తీక్ ఉన్నారు.

 

Top officials inspect power development works in Nizamabad city