Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 May 2026, 2:57 pm Posted by : ramakrishna

సీఎం హమీని అమలు చేయని జిల్లా కాంగ్రెస్ అగ్ర నేతలు రాజీనామా చేయాలి

 

. . . బీజేపీ జిల్లా అధ్యక్షుడు, దినేష్ కులాచారీ

 నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ:

మున్సిపల్ ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందూర్ జిల్లాకు స్వయంగా హామీ ఇచ్చిన ఔటర్ రింగ్ రోడ్ ( ఓఆర్ ఆర్ ), బైపాస్ రోడ్ మంజూరు లో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పీసీసీ అధ్యక్షుడుగా మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహదారుగా సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యేగా భూపతి రెడ్డి ఉన్నప్పటికి సీఎం హామీల అమలులో పూర్తిగా విఫలమయ్యారని , దానికి నైతిక బాధ్యత వహిస్తూ వారు వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.  శుక్రవారం జిల్లా బిజేపి కార్యాలయంలో దినేష్ కులచారీ మాట్లాడుతూ.. జిల్లా ప్రజల సంక్షేమ అభివృద్ధి పనులు మంజూరు, నిధులు తీసుకురా లేకపోతే వారు పదవిలో ఉండి ఏం చేస్తున్నారు, ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోని నాయకులకు పదవిలో కొనసాగే నైతిక హక్కు లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నాయకులకు జిల్లా అభివృద్ధి పై మాత్రం శ్రద్ధ లేదని, తమ సొంత పార్టీ కార్యాలయం కోసం నగర నడిబొడ్డున స్థలాన్ని కేటాయించుకుని వారు, ప్రజలకు ఉపయోగపడే బస్టాండ్ కొరకు మాత్రం స్థలాన్ని గుర్తించలేకపోయారు అని ధ్వజమెత్తారు. పీసీసీ చీప్ మహేష్ కుమార్ గౌడ్ వెంటనే ముఖ్యమంత్రితో మాట్లాడి  ఓఆర్ఆర్ మంజూరు కొరకు పోరాడాలని, లేకపోతే ఇందూరుకు  రింగ్ రోడ్ రాకపోవడానికి ఆయన కారణమంటూ చరిత్ర హీనులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. ఈ అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున పార్లమెంట్ సభ్యులు అర్వింద్ ధర్మపురి నేతృత్వంలో ఆందోళన చేపడతామని దినేష్ పటేల్ కులాచారి హెచ్చరించారు.

Top district Congress leaders who did not implement the Chief Minister's promise should resign

మీ వాటాల కోసం జిల్లా భవిష్యత్తును తాకట్టు పెడతారా…… బీజేపీ రాష్ట్ర కార్యదర్శి గోపిడి స్రవంతి రెడ్డి

సీఎం రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ ల మధ్య కమిషన్ల బేరసారాలు కుదరక ఇందూర్ ఓఆర్ఆర్ ఫైలును పక్కన పడేశారా? మీ వాటాల కోసం జిల్లా భవిష్యత్తును తాకట్టు పెడతారా అని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి గోపిడి స్రవంతి రెడ్డి నిలదీశారు..ఈ సమావేశంలో స్రవంతి రెడ్డి మాట్లాడుతూ ఖమ్మంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన జిల్లాకు ఓఆర్ఆర్ తెచ్చుకోగలిగినప్పుడు, మహేష్ కుమార్ గౌడ్‌కు ఆ దమ్ము లేదా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ఇందూరు గడ్డపై ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేక పోయినందుకు నైతిక బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ కార్పొరేటర్లు, మేయర్ తమ పదవులకు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ మీడియా సమావేశంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతన కార్ లక్ష్మి నారాయణ, నాగోల్ల లక్ష్మి నారాయణ, ఫ్లోర్ లీడర్ ప్రమోద్ కుమార్, రూరల్ కన్వీనర్ పద్మారెడ్డి, కార్పొరేటర్లు మల్కాయ్ మహేందర్, ఎర్రం సుధీర్, మల్లేష్ యాదవ్, బొబ్బిలి వేణుగోపాల్, శ్రీనివాస్ రెడ్డి, చిరంజీవి, కార్యాలయ కార్యదర్శి బద్దం కిషన్, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి అమందు విజయ్ కృష్ణ, బీజేపీ నాయకులు భూపతి, ఆనంద్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు