Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 February 2026, 5:23 pm Posted by : ramakrishna

రేపే షబ్-ఏ-బరాత్ పండుగ…

రుద్రూర్, బతుకమ్మ :

షబ్-ఏ-బరాత్ ముస్లిం సమాజం అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే ప్రధాన పండగలలో ఒకటి. ఈ ఏడాది ఫిబ్రవరి 3న మంగళవారం రాత్రి దేశవ్యాప్తంగా షబ్-ఏ-బరాత్ పండగను జరుపుకొనున్నారు. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం షాబాన్ నెల 15వ రాత్రి ఈ పండగని జరుపుకుంటారు. రంజాన్ నెలకు ముందు ఈ పండగ జరుపుకుంటారు. ఇస్లాంలో షాబాన్ నెల చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. షబ్-ఏ-బరాత్ రోజు పూజించే వ్యక్తుల వారి పాపాలన్నీ క్షమించబడతాయని రాత్రంతా జాగారం చేస్తూ మస్జీద్ లలో ప్రత్యేక నమాజులు ఆచరిస్తూ అల్లాహ్ ను ఆరాధిస్తూ వారి పాపాలను క్షమించమని ప్రార్థిస్తారు. అనంతరం ఖాబరస్థాన్ (కననా వాటిక) వెళ్ళి వారి పూర్వీకుల సమాధులను సందర్శించి మగ్భిఫిరత్‌ (మన్నింపు) కోసం దువా చేస్తారు. శుభాలు సమృద్ధిగా వర్షించి షాబాన్ నెలలో నిర్లక్ష్యానికి తావు ఇవ్వకుండా రంజాన్ నెలను స్వాగతించే విధంగా ఎవరికి వారు సన్నద్ధం అవుతారు. వీలైనన్ని ఎక్కువ ప్రార్ధనలు చేసి దైవ సాన్నిద్యాన్ని పొందాలని చూస్తారు.