రేపు ఏకసభ్య కమిషన్ రాక 

 కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వెల్లడి    నిజామాబాద్, బతుకమ్మ : ఎస్సీ వర్గీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏక సభ్య కమిషన్ ఈ నెల 2న (గురువారం) ఉదయం 11.00 గంటలకు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్), నిజామాబాద్ నందు ఉపవర్గీకరణ, వివరణాత్మక అధ్యయనం కోసం విచ్చేస్తోందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఒక ప్రకటనలో తెలిపారు.  నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లాలోని ఎస్సీ కులానికి చెందిన వారు హాజరై, తెలంగాణ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టీస్ డాక్టర్ షమీమ్...