Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 April 2025, 2:56 pm Posted by : ramakrishna

అంబులెన్స్ అందించిన టోల్ ప్లాజా

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: అథాంగ్ టోల్ ప్లాజా ఆధ్వర్యంలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిస్బిలిటీ (సీఎస్ఆర్) జిల్లా వైద్యోగ్యశాఖకు రూ.౩౦ లక్షల విలువైన అంబులెన్సును అందజేసింది. కలెక్టరేట్ ఆవరణలో బుధవారం కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు టోల్ ప్లాజా అధికారులు అంబులెన్స్ ను అప్పగించారు. ప్రజలకు వైద్య సేవలందించేందుకు అంబులెన్స్ అందించడం అభినందనీయమని కలెక్టర్ అన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్ వో రాజశ్రీ, డీటీవోఉమా మహేశ్వర్, జిల్లా ఇన్ఫర్మాటిక్స్ అధికారి మధు, ఐరాడ్ మేనేజర్ వర్ష, టోల్ గేట్ మేనేజర్ అనిల్, సిబ్బంది విరాజ్, సతీశ్ తదితరులు పాల్గొన్నారు.

Toll plaza provided by ambulance