. . . గ్రామ సర్పంచ్ ఇందూరు సునీత చంద్రశేఖర్
రుద్రూర్, బతుకమ్మ :
గ్రామ అభివృద్దే లక్ష్యంగా గ్రామంలో ఉన్న సమస్యల ను పరిష్కరించే విధంగా కృషి చేసేందుకు గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయడం జరిగిందని గ్రామ సర్పంచ్ ఇందూరు సునీత చంద్రశేఖర్ తెలియజేశారు. ఈ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా గ్రామ ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించే విధంగా కృషి చేస్తామని ఆమె పేర్కొన్నారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేయవచ్చన్నారు. గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయడంతో గ్రామ ప్రజల సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయని గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.