యంచలో కన్నుల పండుగగా తొలి ఏకాదశి వేడుకలు

  నిర్మల్, బతుకమ్మ :   నిర్మల్ జిల్లా బాసర పొరుగు గ్రామమైన గోదావరి నది తీరంలో గల యంచ గ్రామంలో శనివారం తొలి ఏకాదశి వేడుకలు కన్నులపండువగా జరిగాయి. “రెండో పండరీపురం”గా పేరొందిన యంచలో వేకువజామున విఠల - రుక్మిణులకు అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఉపవాస దీక్షలతో భక్తులు ఉదయమే బారులు తీరారు. గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో హనుమాన్ మందిరం నుంచి కలశం, భజనలతో దిండి శోభాయాత్ర సాగింది. మహిళలు,...