Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 October 2024, 8:05 pm Posted by : ramakrishna

ఫేక్ యూపిఐ మేసేజ్ తో రూ.50 వేలకు టోకరా

ఆన్ లైన్ పే చేయకుండా ఫేక్ మేసేజ్ తో మోసం
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: యూపిఐ చేసినట్లు పేక్ మెసేజ్ చూపించి రూ.50 వేలు తీసుకుని మోసగాడు జారుకున్నసంఘటన నిజామాబాద్ నగరంలో జరిగింది. నగర నాల్గవ టౌన్ ఎస్ఐ శ్రీకాంత్ తెలిపిన కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి… నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్ కు చెందిన రాఘవేంద్ర చారీ ఈ నెల 8న ఆర్య నగర్ కు చెందిన బ్యాంకు డిపాజీట్ మెషీన్ లో రూ.50 వేలు నగదు జమ చేసేందుకు వచ్చాడు. అక్కడే ఉన్న ఓక వ్యక్తి తనకు అత్యవసరంగా రూ.50 వేలు అవసరం ఉందని అ డబ్బు తనకు ఇస్తే యూపిఐ చేస్తానని నమ్మించాడు. రాఘవేంద్రచారీ తన వద్ధ ఉన్న రూ.50 వేలు ఇవ్వగానే తన పోన్ నుంచి యుపిఐ చేసినట్లు ఓక పేక్ మేసేజ్ చేసి జారుకున్నాడు. డబ్బులు క్రేడిట్ కాకపోవడంతో తాను మోసపోయానని గ్రహించి పోలిస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు.