ఇందల్వాయి , బతుకమ్మ :
ఇందల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని సిర్నపల్లి గ్రామానికి చెందిన నాగపురి కిషోర్ గౌడ్ ప్రమాదవశాత్తు తాటి చెట్టు పై నుండి పడి మృతి చెందినట్లు ఇందల్వాయి ఎస్సై సుమలత తెలిపారు, ఆమె తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి బుధవారం సాయంత్రం వృత్తి రీత్యా కళ్ళు గీయడానికి వెళ్లిన కిషోర్ గౌడ్ ప్రమాదవశాత్తు తాటి చెట్టు పై నుండి పడి అక్కడికక్కడే మృతి చెందినట్లు భార్య నాగపురి లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇందల్వాయి ఎస్ఐ సుమలత తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించడం జరిగిందని ఆమె వివరించారు. భార్య లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ సుమలత తెలిపారు