కామారెడ్డి, బతుకమ్మ : నకిలీ ఓటర్ ఐడి ఆధారంతో ఎక్సైజ్ శాఖ అధికారులు కల్లు దుకాణం లైసెన్స్ ఇచ్చిన ఘటన కామారెడ్డి జిల్లాలోని కారడ్ పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కరడ్ పల్లి గ్రామానికి చెందిన సంపత్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ రామారెడ్డి మండలం రెడ్డి పెట్ గ్రామానికి చెందిన స్వామి గౌడ్ నకిలీ ఓటర్ ఐడి కార్డు ఆధారంతో కల్లు దుకాణం లైసెన్స్ పొందరని తెలిపారు. ఈ విషయమై పలుసార్లు కామారెడ్డి ఎక్సైజ్ సూపర్డెంట్ దృష్టికి ఆధారాలతో తీసుకెళ్లిన వారిపై చర్యలు తీసుకోలేదని అన్నారు. జిల్లా కలెక్టర్ కు ప్రజావాణిలో ఫిర్యాదు చేశానని తెలిపారు. చివరికి కరడ్ పల్లి గ్రామపంచాయతీ కార్యదర్శి విచారణ చేపట్టి ఈ ఓటర్ ఐడి కార్డు మా గ్రామ పంచాయతీలో లేదని నిర్ధారించారు. నకిలీ ఓటర్ ఐడి కార్డు, నకిలీ ధ్రువపత్రాలను సృష్టించి ఎక్సైజ్ శాఖ అధికారులను తప్పుదోవ పట్టించి కారడ్ పల్లి గ్రామంలో కల్లు దుకాణం లైసెన్స్ పొందిన స్వామి గౌడ్ పై చర్యలు తీసుకోవాలని అతనికి ఇచ్చిన లైసెన్స్ ను రద్దు చేయాలని జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశానని తెలిపారు.