రేపు తపస్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ధర్నా
నిజామాబాద్ సిటి, బతుకమ్మ:
పెండింగ్ బిల్లులు డిఏలు పి అర్ సి నీ వెంటనే ప్రకటన చేసి అమలు చేయాలని కోరుతూ తపస్ అధ్వర్యంలో జిల్లా స్థాయి ధర్నా నిర్వహిస్తున్నట్టు తపస్ ఇందూర్ జిల్లా అధ్యక్షులు పరళి కృష్ణ వేణి, భట్టు బద్రినాథ్ తెలిపారు. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ఉపాధ్యాయ ధర్మాగ్రహ దీక్ష పేరుతో నిరసర తెలుపుతామని పేర్కోన్నారు. పెండింగ్ లో ఉన్న 4 డిఏలు ఏరియర్స్ తో సహా వెంటనే చెల్లించాలని , అన్ని రకాల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని, పిఆర్సి ని వెంటనే ప్రకటించి అమలు చేయాలని కోరుతూ మంగళవారం జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ (పాత కలెక్టర్ కార్యాలయం )వద్దగల ధర్నా చౌక్ నందు శాంతియుత ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ ధర్నా కార్యక్రమానికి జిల్లాలో ఉన్న ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో హాజరైన విజయవంతం చేయగలరని వారు కోరారు .