Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 October 2025, 10:48 pm Posted by : ramakrishna

నేడే ఆఖరి రోజు

  • ఒక్కరోజు ముందు వెయ్యి వరకు దరఖాస్తులు
  • మద్యం లైసెన్స్ ల కోసం పోటాపోటీగా దరఖాస్తులు
  • పొడగించేది లేదంటున్న ప్రభుత్వం

 

నిజామాబాద్, బతుకమ్మ : మద్యం దుకాణాల నిర్వాహణను దక్కించుకునేందు వ్యాపారులు క్యూకట్టారు. సెప్టెంబర్ మాసంలో జిల్లాలోని 102 మద్యం దుకాణాల లైసెన్స్ ల కోసం ప్రభుత్వం మద్యం పాలసీని ప్రకటించిన విషయం తెల్సిందే. జిల్లాలోని మద్యం దుకాణాల నిర్వాహణ కోసం 3 లక్షల (నాన్ రిఫండబుల్) డీడీ చెల్లించి దరఖాస్తు చేసుకున్న వారిని లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేసే ప్రక్రియకు గత నెలలో శ్రీకారం చుట్టిన విషయం తెల్సిందే. ఈ నెల 18తో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగియనుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం వెయ్యి వరకు దరఖాస్తులు వచ్చినట్లు తెలిసింది. సాయంత్రం 7 గంటల వరకే 732 దరఖాస్తులు రావడం విశేషం. నిజామాబాద్ జిల్లాలోని మద్యం షాప్ ల కొరకు ఈ నెల 16 వరకు 687 దరఖాస్తులే రావడం గమనార్హం. అయితే మద్యం దుకాణాల నిర్వాహణ కోసం లక్కీ డ్రాలో పాల్గొనేందుకు విధించిన ఫీజు పెంచినా ఆశవాహులు మాత్రం వెనక్కి తగ్గలేదు. శుక్రవారం ఒక్కరోజే వందల మంది క్యూలో ఉండి దరఖాస్తు చేసుకున్నారు. రాత్రి 10 గంటల వరకు అయినా దరఖాస్తులు స్వీకరించేందుకు ఎస్ హెచ్ వోల వారిగా ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసింది ఎక్సైజ్ శాఖ. శుక్రవారం ఒక్క రోజు రూ.30 కోట్ల వరకు ఆదాయం వచ్చింది. 2023-25 మద్యం పాలసీ సమయంలో  మొత్తంగా 3759 దరఖాస్తులు వచ్చాయి. మొత్తంగా ఆనాడు 75.18 కోట్ల ఆదాయం వచ్చింది. అయితే ఈ సంవత్సరం ఆదాయం పెంచడంపై ప్రభుత్వం అంచనాలను పెంచింది. ఈసారి 150 కోట్ల వరకు ఆదాయం కేవలం దరఖాస్తుల ద్వారానే వస్తుందని అంచనా వేస్తోంది. గతంలో చివరి రోజు ఒక్కరోజే 2048 దరఖాస్తులు రావడంతో దాని ప్రకారం ఈ నెల 18న 3 వేల పైచిలుకు దరఖాస్తులు వస్తాయన్న ఆశతో ఎదురు చూస్తున్నారు. అయితే ఈసారి కూడా గతంలో కూడా ఎస్సీ, ఎస్టీ , గౌడ  కులస్తులకు రిజర్వేషన్ వేసిన చోట తక్కువ దరఖాస్తులు వచ్చాయి. ఆయా రిజర్వుడ్ షాప్ లను దక్కించుకునేందుకు సంబంధిత సామాజిక వర్గాల వారు లేకపోవడంతో మద్యం సిండికేట్ ఆయా షాప్ లను దక్కించుకునేందుకు వారిచేతనే దరఖాస్తులు వేయిస్తున్నట్లు సమాచారం. చివరి రోజు అయిన శుక్రవారం భారీ ఎత్తున దరఖాస్తులు వస్తాయని రాత్రి వరకు స్వీకరణకు ఏర్పాట్లు చేసింది ఆబ్కారి శాఖ. ఈ నెల 23న లక్కీ డ్రా ద్వారా దుకాణాల కేటాయింపు ఉండడంతో గడువు పెంచే ప్రసక్తే లేదని, ఇది వరకే లక్కీ డ్రా సమయాన్ని ప్రకటించడంతో ఇదే విషయాన్ని అధికారులు ప్రస్తావిస్తున్నారు. పండుగ వేళ మద్యం దుకాణాల నిర్వాహణ కోసం గడువు పొడగిస్తారనే ప్రచారాన్ని అధికారులు కొట్టిపారేస్తున్నారు.