నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జాతీయ పెట్రోలిమ్, ఇందన వనరుల శాఖ సూచన మేరకు సాక్ష్యం 2025 కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఇందన పొదుపు ర్యాలీని నిర్వహించారు.హిందూస్తాన్ పెట్రోలిమ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ దగ్గర నిర్వహించిన ఈ ర్యాలీలో హెచ్ పీ సీ ఎల్ రీజినల్ మేనజర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఇందనం పొదుపుగా వాడి ఇతర ప్రత్యామ్నాయమైన సీ ఏన్ జీ, ఎలక్ట్రికల్ వైపు ద్రుష్టి సారించాలని అన్నారు.భవిష్యత్ తరాలకు కాలుష్య రహిత ఎన్వేరాన్ మెంట్ కు అందించేందుకు తొడ్పాడాలని కోరారు. ఈ కార్యక్రమం లో ఏతేంద్ర కోమా, డీలర్లు కర్క శ్రీకాంత్ రెడ్డి, విజయానాథ్, వినోద్ రెడ్డి,సందీప్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.