- శ్రీధర్ బాబు ప్రాబల్యాన్ని నియంత్రించేందుకు
- కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిని ముఖ్యమంత్రే ఓడిస్తున్నాడు
- స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి బక్క జడ్సన్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : సీఎం రేవంత్ రెడ్డి తన పదవి కాపాడుకోవడానికి కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిని ఓడించడానికి కుట్రలు చేస్తున్నారని పట్టభద్రుల నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి, మాజీ కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ ఆరోపించారు. నిజామాబాద్ నగరంలోని ప్రెస్ క్లబ్ లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, తెలుగుదేశం పూర్వ కార్యకర్త అయినా మేడిపల్లి సత్యం అని తెలిపారు. అతనికి అత్యంత సన్నిహితుడైన ప్రసన్న హరికృష్ణ కి ఎమ్మెల్సీ బీఫామ్ కోసం ప్రయత్నించారని తెలిపారు. టికెట్ ప్రయంత్రించినప్పటికీ ఐటి ఇండస్ట్రీస్ మినిస్టర్ దుద్దుల శ్రీధర్ బాబు తన పంతం నెగ్గించుకొని నరేందర్ రెడ్డి కి ఇప్పించారని అన్నారు. 42 అసెంబ్లీలు ఉన్నఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో రామచంద్రపురం నుండి ఆదిలాబాద్ వరకు దుదిల్ల శ్రీధర్ బాబు పేరు మారుమోగుతుందని తలచిన రేవంత్ రెడ్డి తనకు అనుకూలంగా ఇదివరకే ఉపముఖ్యమంత్రి రేసులో ఉన్న పొన్నం ప్రభాకర్ ను రంగంలో దించి ప్రసన్న హరికృష్ణను ఇండిపెండెంట్గా నామినేషన్ వేయించారని ఆరోపించారు. ప్రసన్న హరికృష్ణ పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో ఆయన సూచనల మేరకు టికెట్ కోసం టిఆర్ఎస్ పార్టీని ఆశ్రయించారని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఏ విధంగానైనా శ్రీధర్ బాబు అభ్యర్థిని ఓడించాలని కంకణ బదుడై ఉన్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి తనకు పదవి గండం ఉందని గ్రహించి శ్రీధర్ బాబు ప్రాబల్యాన్ని నియంత్రించాలని ఏ విధంగానైనా కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించాలన్న వ్యూహంలో భాగంగా రేవంత్ రెడ్డి ఈ పన్నాగం పనునుతున్నారన్నారు. ఇదివరకే తనకు పోటీదారులైన లేక తన గూర్చి అసమ్మతి వ్యక్తం చేసిన నాయకులైన జీవన్ రెడ్డి, జగ్గారెడ్డి, మధు యాష్కిలను వ్యూహాత్మకంగా ఓడించారని ఆరోపించారు. అదే పంతానికి వెళ్తున్న రేవంత్ రెడ్డి ప్రస్తుతానికి కరీంనగర్ కేంద్రంగా పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో దుద్దుల శ్రీధర్ శ్రీధర్ బాబు నాయకత్వాన్ని నియంత్రించాలని అదే వ్యూహాన్నిఅనుసరిస్తున్నారని తెలిపారు. దీన్నిప్రజలు గ్రహించాలని కోరారు. గత 34 సంవత్సరాలుగా ప్రజా క్షేత్రంలో నిబద్ధతతో కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగా కృషి చేసిన తనను ఏ విధంగా నియంత్రించారో అందరికీ తెలుసని పేర్కొన్నారు. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రులందరూ తమ విలువైన ఓటుతో తనను బలపరచాలని కోరారు.