Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 November 2025, 4:49 pm Posted by : ramakrishna

క్రీడల్లో జాతీయ స్థాయిలో రాణించాలి

  • ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

 

మెండోరా, బతుకమ్మ: ప్రతి క్రీడాకారుడు ఆటల్లో మంచి ప్రతిభ కనబరిచి జాతీయస్థాయిలో రాణించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. క్రీడలతో మానసిక ఉల్లాసం ఉంటుందని పేర్కొన్నారు. మెండోరా మండల కేంద్రంలోని వెంకటేశ్వర ఆలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్న 69వ ఎస్జిఎఫ్ మెండోరా మండల స్థాయి అంతర పాఠశాలల క్రీడల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడలను ప్రారంభించారు. వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన మార్చి ఫస్ట్ అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రతిభ చూపించిన క్రీడాకారులకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి శ్రీనివాస్, ఫిజికల్ డైరెక్టర్ నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

To excel at national level in sports