సర్వే సూపర్వైజర్ అధికారులతో సమీక్షించిన మున్సిపల్ కమిషనర్
నిజామాబాద్ సిటీ బతుకమ్మ : నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న సామాజిక ఆర్థిక సర్వే 2024 ప్రగతిని నగర కమిషనర్ దిలీప్ కుమార్ సూపర్వైజరి అధికారులతో సమీక్షించారు. శనివారం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అధికారులకు ఆయన దిశా నిర్దేశం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఎనుమరేటర్లచే పూర్తి చేయించాలి అని ఆదేశాలు జారీ చేశారు. అడిగిన సమాచారాన్ని ఇచ్చి ఎనుమరేటర్లకు సహకరించాల్సిందిగా నగర ప్రజలకు కమిషనర్ కోరారు. ఈ సమీక్ష సమావేశంలో నగర పాలక సంస్థ అధికారులు సూపర్వైజరీ అధికారులు పాల్గొన్నారు.