Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 May 2026, 8:20 pm Posted by : ramakrishna

టీఎన్జీవోస్ ఉపాధ్యక్షుడు మాణిక్యం కు ఘన సన్మానం

 

వేల్పూర్, బతుకమ్మ :

 

వేల్పూర్ మండల కేంద్రంలోని ఐకెపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన గ్రామస్థాయి సమన్వయకర్తల సమావేశంలో టీఎన్జీవోస్ జిల్లా ఉపాధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన బత్తుల మాణిక్యం అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ వేల్పూర్ ని మండల కేంద్రంలో ఘనంగా సన్మానించారు. అదే విధంగా భీంగల్ తాలూకా స్థాయి నాయకులు ప్రమీల ప్రాజెక్టు మేనేజర్ భీమ్గల్ పురస్తు నరేష్ గడల రఘుపతి ఎడెల్లి రవి కమ్యూనిటీ కోఆర్డినేటర్లను సన్మానించారు. ఇటీవలే ఎల్ 1, ఎల్ 2 యూనియన్ ఎన్నికలలో ఏకగ్రీవంగా ఎన్నికైన జిల్లా అధ్యక్షుడు తడకల శ్రీనివాస్ కోశాధికారి గా ఏకగ్రీవంగా ఎన్నికైన అల్గోట్ భోజన్న లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో భీంగల్ ఏరియా సీసీలు వెన్న మురళి, మహేందర్, గాజుల, శ్రీనివాస్, నవీన్, సరళ, లక్ష్మి, అకౌంటెంట్ మహేష్, వివోఏలు తదితరులు పాల్గొన్నారు.