Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 January 2026, 8:20 pm Posted by : ramakrishna

టీఎన్జీవోస్ క్యాలెండర్ విడుదల

భీమ్ గల్ , బతుకమ్మ :

 

ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు శ్రీ నాశెట్టి సుమన్ కుమార్ ఆదేశానుసారం భీమ్ గల్ యూనిట్ అధ్యక్షులు సృజన్ కుమార్ అధ్యక్షతన టీఎన్జీవో భీమ్ గల్ యూనిట్ క్యాలెండరును మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్, తహసిల్దార్ శ్రీ షబ్బీర్ చేతుల మీదుగా సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ యూనిట్ అధ్యక్ష, కార్యదర్శులు,కార్యవర్గ బృందానికి వారు ముందుగా శుభాకాంక్షలు తెలిపారు.ఉద్యోగుల సమస్యల పై నిరంతరం పోరాడుతున్న యూనిట్ అధ్యక్ష, కార్యదర్శులను అభినందించారు. ఈ కార్యక్రమంలో భీమ్ గల్ యూనిట్ సహాధ్యక్షులు కుంట శ్రీనివాస్, ఉపాధ్యక్షులు పురస్తు నరేష్ , ఎడెల్లి రవి, సంయుక్త కార్యదర్శి శ్రీనివాస్ ,కార్యవర్గ సభ్యులు ప్రభాకర్, రాకేష్, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.