Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 June 2026, 8:46 pm Posted by : ramakrishna

జిల్లా అదనపు కలెక్టర్, డీఆర్వోలకు టీఎన్జీవోస్ ఘన స్వాగతం

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

జిల్లాకు నూతనంగా బదిలీపై విచ్చేసి పదవీ బాధ్యతలు స్వీకరించిన జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) వి. భుజంగరావు ని, జిల్లా రెవెన్యూ అధికారి బి. గీత ని టీఎన్జీవోస్ సంఘం ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలోని వారి ఛాంబర్లలో ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్ ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం పూల బొకేలు అందజేసి నూతన బాధ్యతల్లో విజయవంతం కావాలని ఆకాంక్షించింది. అనంతరం జిల్లా ఉద్యోగులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలు, పరిపాలనా అంశాలపై అధికారులతో సవివరంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్, రాష్ట్ర కార్యదర్శి పోల శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు జాఫర్ హుస్సేన్, అర్బన్ యూనిట్ అధ్యక్షులు జాకీర్ హుస్సేన్, రూరల్ యూనిట్ అధ్యక్షులు జ్ఞానేశ్వర్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు సునీల్, స్వామి, సాయికృష్ణ, విజయ్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులతో ఉద్యోగుల సంక్షేమం, సమస్యల పరిష్కారం కోసం పరస్పర సహకారంతో ముందుకు సాగాలని ప్రతినిధులు ఆకాంక్షించారు.

 

TNGOs accord grand welcome to District Additional Collector and DROs.