మహ్మద్ షబ్బీర్ అలీ ని మర్యాదపూర్వకంగా కలిసిన టీఎన్జీవో సభ్యులు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఇటీవల ఎంప్లాయిస్ హెల్త్ స్కీం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ప్రకటన చేయుటకు కృషి చేసిన ప్రభుత్వ రాష్ట్ర ముఖ్య సలహాదారులు మహ్మద్ అలీ షబ్బీర్ ని టీఎన్జీవోస్ పక్షాన మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. జేఏసీ ఎంప్లాయిస్ రాష్ట్ర చైర్మన్, టిఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్, టీఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.ఎం. హుస్సేనీ (ముజీబ్) ఆదేశానుసారం ఆదివారం డా. బి.ఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం లోని వారి కార్యాలయంలో కలిసి షబ్బీర్...