Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 March 2026, 9:04 pm Posted by : ramakrishna

మహ్మద్ షబ్బీర్ అలీ ని మర్యాదపూర్వకంగా కలిసిన టీఎన్జీవో సభ్యులు

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

ఇటీవల ఎంప్లాయిస్ హెల్త్ స్కీం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ప్రకటన చేయుటకు కృషి చేసిన ప్రభుత్వ రాష్ట్ర ముఖ్య సలహాదారులు మహ్మద్ అలీ షబ్బీర్ ని టీఎన్జీవోస్ పక్షాన మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. జేఏసీ ఎంప్లాయిస్ రాష్ట్ర చైర్మన్, టిఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్, టీఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.ఎం. హుస్సేనీ (ముజీబ్) ఆదేశానుసారం ఆదివారం డా. బి.ఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం లోని వారి కార్యాలయంలో కలిసి షబ్బీర్ అలీ కి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఉమ్మడి జిల్లాల ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్, టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్ ఉద్యోగుల సమస్యలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్, టీఎన్జీవో ఆర్మూర్ యూనిట్ అధ్యక్షులు శశికాంత్ రెడ్డి, భీమ్గల్ యూనిట్ అధ్యక్షులు సృజన్ కుమార్, జిల్లా కార్యవర్గ సభ్యులు సునీల్ తదితరులు పాల్గొన్నారు.