నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
జిల్లా కేంద్రానికి విచ్చేసిన పంచాయతీ రాజ్, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి, నిజామాబాద్ జిల్లా ఇంచార్జి సీతక్క ని ఆర్ అండ్ బి వసతి గృహం లో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి బొకే ఇచ్చి శాలువాతో సన్మానించారు. ఇటీవల ఉద్యోగుల ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్(ఈహెచ్ఎస్), ఉద్యోగుల వ్యక్తిగత చందాతో పాటు ప్రభుత్వ చందా కలిపి పటిష్టంగా ఏర్పాటు చేయుటకు మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులు రావాల్సి ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ సమావేశం లో ప్రవేశపెట్టిన తీర్మానం ఆమోదానికి కృషి చేసిన మంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. జిల్లా ఉద్యోగుల సమస్యలపై వినతిపత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన మంత్రి సమస్యలన్నింటిని త్వరలో పరిష్కరించుటకు కృషి చేస్తానని హామీ ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్, జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్ఈ, కార్యక్రమానికి టీఎన్జీవో రాష్ట్ర కార్యదర్శి పోల శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు కేపీ. సునీత, జాఫర్ హుస్సేన్, అర్బన్ యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు జాకీర్ హుస్సేన్, మారుతి జిల్లా కార్యవర్గ సభ్యులు స్వామి, టీఎన్జీవో ముఖ్య సలహాదారులు వరమాల సుధాకర్, అంగన్వాడీ ఉద్యోగులు, తదితరులు హాజరయ్యారు.