చీఫ్ సెక్రటరీని కలిసిన టీఎన్జీవో నాయకులు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన రామకృష్ణారావును టీఎన్జీవోలు మర్యాదపూర్వకంగా కలిసారు. రాష్ట్ర సచివాలయంలో బుధవారం తెలంగాణ టీఎన్జీవో అధ్యక్షతన రాష్ట్ర ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముజిబ్ హుస్సెన్, నిజామాబాద్ జిల్లా అధ్యక్షలు నాశెట్టి సుమన్ కుమార్, ఇతర కార్యవర్గ సభ్యులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఉద్యోగుల సమస్యలపై నిర్ణయించిన దాని ప్రకారంగా ఆర్థికేతర అంశాల అమలు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. ...