Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 June 2025, 7:39 pm Posted by : ramakrishna

చీఫ్ సెక్రటరీని కలిసిన టీఎన్జీవో నాయకులు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన రామకృష్ణారావును టీఎన్జీవోలు మర్యాదపూర్వకంగా కలిసారు. రాష్ట్ర సచివాలయంలో బుధవారం తెలంగాణ టీఎన్జీవో అధ్యక్షతన రాష్ట్ర ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముజిబ్ హుస్సెన్, నిజామాబాద్ జిల్లా అధ్యక్షలు నాశెట్టి సుమన్ కుమార్, ఇతర కార్యవర్గ సభ్యులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఉద్యోగుల సమస్యలపై నిర్ణయించిన దాని ప్రకారంగా ఆర్థికేతర అంశాల అమలు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు.  ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ కొరకు పునర్వ్యవస్థీకరణ కమిటీ ను వెంటనే వేయాలని, ఆర్థిక అంశాల అమల్లో భాగంగా  ప్రతినెల 700 కోట్ల పెండింగ్ బిల్లులు ఉద్యోగుల ఖాతాలో జమ  చేస్తామని తెలిపిన విషయాన్ని గుర్తు చేస్తూ అట్టి ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని తెలిపారు.  సానుకూలంగా స్పందించిన చీఫ్ సెక్రటరి సమస్యలన్నింటి అతి త్వరలో  పరిష్కరిస్తామని తెలిపినందుకు టీఎన్జీవో రాష్ట్ర శాఖ పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. సీఎస్ ను కలిసిన వారిలో టీఎన్జీవో రాష్ట్ర సహాధ్యక్షులు కస్తూరి వెంకటేశ్వర్లు, హైదరాబాద్ సిటీ అధ్యక్షులు శ్రీకాంత్, కేంద్ర కార్యవర్గ సభ్యులు కొండల్ రెడ్డి, పర్వతాలు తదితరులు పాల్గొన్నారు.